పళ్లపై నల్ల గార వచ్చిందంటే గుంపులో ఉన్నప్పుడు మన నోరు తెరుచుకోదు. మనస్పూర్తిగా నవ్వాలంటే పంటిగార భూతంలా అడ్డుకుంటుంది. ఈ బాధ తొలగించుకోవాలంటే దంతవైద్యుడి దగ్గరకు వెళ్లి క్లీన్ చేయించుకోవాలి. కాని అంత శ్రమలేకుండా చిన్నపాటి చిట్కాలు పాటిస్తే పంటి గార సమస్య పోతుందని అమెరికా వైద్యులు అంటున్నారు.
రోజూ భోజనానంతరం ఒక యాపిల్ తింటే చాలు.... మిలమిల మెరిసే పళ్లతో హాయిగా నవ్వొచ్చని వైద్యుల ఉవాచ. ఎలాగంటే... యాపిల్‌లో ఉండే ఆమ్లగుణం. పిండిపదార్థం కలిసి అధిక పీచు పదార్థంలా మారుతుంది. దీనివల్ల పళ్లపై గారలు తొలగిపోయి మిలమిల మెరుపు వస్తుందంటున్నారు.
యాపిల్, చెరకు, క్యారట్, వంటివి నమిలి తింటే అవి మనం ఉపయోగించే టూత్ బ్రష్‌లా పనిచేస్తాయని వైద్యులు డంకా భజాయించి చెబుతున్నారు. సో..... పళ్లు తళతళలాడాలంటే జాగు సేయకుండా వెంటనే మొదలు పెట్టండి.
|