విపరీతమైన పనిభారంతో అటు ఇంట్లోనూ, ఇటు ఆఫీసుల్లోనూ సతమతమవుతున్న మహిళలకు జుట్టు సమస్యలు కూడా అధికంగా బాధిస్తుంటాయి. వీరిలో కొంతమందికి వెంట్రుకల కొసలు చిట్లిపోయి, పెళుసుబారినట్లుగా తయారవుతాయి. వీటికితోడు తలలో చుండ్రు సమస్య కూడా తోడవుతుంది. నూనె పెడితే జిడ్డులాగా, పెట్టకుంటే పీచులాగా తయారయ్యే వెంట్రుకల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించటం కూడా చాలా అవసరం. | | జుట్టు కుదుళ్ళలోకి నూనె ఇంకేలా పెట్టిన తరువాత వెంట్రుకల చివరన కూడా నూనె పెట్టాలి. పదినిమిషాలపాటు అలాగే ఉంచిన తరువాత తల పై భాగం నుండి కిందివరకు, కింది నుంచి పైకి, చెవి వెనుక భాగంలో ఆపోజిట్ డైరెక్షన్‌లో వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. |
| |
ఇలాంటివారు మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుండి విశ్రాంతి పొందేందుకు హెడ్ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. హెడ్ మసాజ్‌తో పాటు పదిహేను రోజులకు ఒకసారి జుట్టుకు హెన్నా పెట్టుకుని వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే... వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండి కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
ఇపుడు హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం...!
తలను మసాజ్ చేసుకోవడం అంటే... మంచి కొబ్బరినూనెను తీసుకుని ఒక పద్ధతి ప్రకారం మెల్లగా మర్దనా చేయాలి. ఇలా చేస్తేనే మసాజ్ వల్ల ఉపయోగం. కానీ కొంతమంది... కాస్తంత నూనెను తీసుకుని గబగబా తలకు మర్ధించుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు. కానీ అలా చేయడంవల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదన్న సంగతిని వారు గుర్తించరు.
|