అన్ని రకాల భాషల సాహిత్యంలోనూ స్త్రీల అధరాలను గురించిన వర్ణన లేదంటే అతిశయోక్తి కాదు. తేనెలూరే పెదవులు, మృధువైన పెదవులు, అందమైన పెదవులు అంటూ ఎన్నో రకాలుగా మహిళల అధర సౌందర్యం గురించి వర్ణిస్తుంటారు. ఇక సినిమాలలో వస్తోన్న పాటలలో అయితే చెప్పాల్సిన పనేలేదు!
అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం... నీ రూపే మనోహరం... నీ చూపే స్వయంవరం... నీవే నాకో వరం... అంటూ వచ్చిన అనేకమైన పాటల గురించి మీకు తెలిసే ఉంటుంది. అందం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం. "అందం అనేది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్ని కలుగజేస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నది త్వరలో అందాన్ని పొందుతుంది" అనేవి పలువురు పెద్దలు చెప్పిన సూక్తులు. | | రాత్రిళ్ళు పడుకునేముందు బీట్‌రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా... |
| |
అనేకమంది కవుల కలాల నుండి కూడా మహిళల సౌందర్యం గురించిన గొప్ప సాహిత్యం జాలువారింది. అలాంటి మహిళల సౌందర్యంలో ముఖ్యపాత్రను పోషించే పెదవుల సౌందర్యం గురించిన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదవులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపుదనం పోతుంది. పెదవులవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ, వేజలైన్ గానీ... రాసుకోవడం మంచిది.
పెదవులు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్‌రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా చేసుకుంటే మంచిది.
|