ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > అతివల అధర సౌందర్యం కోసం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అతివల అధర సౌందర్యం కోసం...!
ఎక్కువ సేపు లిప్‌స్టిక్ నిలిచి ఉండాలంటే... రెండు సార్లు లిప్‌స్టిక్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దిన తరువాత మరోసారి వేసుకోవాలి. అలాగే... ఎప్పుడు లిప్‌స్టిక్ వేసుకున్నా, పడుకునేముందు, దాన్ని తొలగించి, పడుకోవడం మరచిపోవద్దు.

లిప్‌స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగలకుండా వుంటాయి. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్‌లైనర్ వాడండి. దీనివల్ల లిప్‌స్టిక్ అటూ, ఇటూ మూతి చుట్టూ పరచుకోకుండా ఉంటుంది. లిప్‌స్టిక్, వేజలైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి. లిప్‌స్టిక్‌ను బ్రష్‌తో వేసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చు. సహజమైన సన్ బ్లాక్ ఉన్న లిప్ బాం పెదవులకు వాడటం శ్రేయస్కరం.

పెదవులు ఆరోగ్యంగా కనిపించాలంటే... నోటి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి. చక్కటి, తెల్లటి పలువరుస కూడా పెదాల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. పళ్ళు తెల్లగా మిలమిలా మెరవాలంటే... ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.

పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి. ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి. నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది. పైన చెప్పిన చిట్కాలన్నింటినీ పాటిస్తే... తేనెలూరే మృధువైన పెదవులు మీ సొంతమవుతాయి.
<< 1 | 2 
మరిన్ని
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!
హెడ్ మసాజ్‌తో చక్కటి ఆరోగ్యకరమైన కురులు
యాపిల్ తింటే పళ్లు మిలమిల..
జుట్టు రాలేందుకు కారణాలు బోలెడు...
రెండింటికీ ఉపశమన మార్గం స్పాస్  
మైమరిపించే పెదవులకు నిగారింపు...