ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...! Search similar articles
Shoba
Jr Sub Editor
FileFILE
నాజూకైన చేతులు స్త్రీల అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. కొంతమంది అమ్మాయిల చేతులు లేత తమలపాకుల్లా మెత్తగా, హాయిగా ఉంటే... మరికొంతమంది చేతులు గరుకుగా ఉంటాయి. అలాగే మరికొంతమంది అమ్మాయిల మోచేతులు నల్లగా, గరుకుగా అసహ్యంగా ఉంటాయి. ఇలాంటమ్మాయిలు దాన్ని కప్పుపుచ్చుకునేందుకు చాలావరకు మోచేతుల కింది దాకా ఉండే డ్రస్సులను వేసుకుంటారు.
చేయండిలా...!
  గుడ్డులోని తెల్ల మిశ్రమం, రోజ్ వాటర్ ఆరు చుక్కలు, నిమ్మరసం ఒక టీస్పూను, పాలు ఒకటిన్నర స్పూను, పంచదార పొడి అర స్పూను, మిల్క్ పౌడర్ ఒక టీస్పూను తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి చేతులకు పట్టించాలి...      


మోచేతులు నల్లగా ఉండే అమ్మాయిలు పొట్టి చేతులు ఉన్న టాప్స్ ధరించేందుకు భయపడతారు. అలాంటివారు రోజ్‌వాటర్ రెండు టీస్పూన్లు, ఒక నిమ్మకాయ చెక్క, నాలుగు చుక్కల గ్లిజరిన్‌తో ఇంట్లోనే ప్యాక్ వేసుకుని మోచేతులను అందంగా చేసుకోవచ్చు.

ఇదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయ చెక్కును తీసి, రసం పిండి, అందులోనే రోజ్ వాటర్, గ్లిజరిన్ బాగా కలిసేలా కలిపి ఆ మిశ్రమాన్ని మోచేతులకు రాయాలి. అలాగే 30 నిమిషాలపాటు ఉంచుకున్న తరువాత చల్లటి నీళ్ళతో కడిగివేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మోచేతుల నలుపుదనం, గరుకుదనం తగ్గి మృదువుగా తయారవుతాయి.
1 | 2  >>  
మరిన్ని
అతివల అధర సౌందర్యం కోసం...!
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!
హెడ్ మసాజ్‌తో చక్కటి ఆరోగ్యకరమైన కురులు
యాపిల్ తింటే పళ్లు మిలమిల..
జుట్టు రాలేందుకు కారణాలు బోలెడు...
రెండింటికీ ఉపశమన మార్గం స్పాస్