"ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ" ఈ పాటను ఎక్కడో విన్నారు కదూ...! ఎక్కడంటే... ముత్యాలముగ్గు సినిమాలో...! హమ్మయ్య ఇప్పటికి గుర్తొచ్చిందా...?! అది సరేలెండి. ఆ విషయాన్ని కాసేపలా పక్కన పెడితే ముత్యం అంత పసుపును ముఖమంతా రాసుకుంటే ముఖం వెలిగిపోతుందని కవి ఆ పాటలో చెబుతున్నాడు. పసుపు అందం పసుపుదైనా తెల్లగా మెరిసిపోయే ముత్యాలకు ఏదీ దీటు రాదు మరి...! అలాంటి ముత్యాల గురించి కాస్తంత...!| మీ ప్రత్యేకతను చాటుకోండిలా...! |
| | తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి. కాబట్టి అలాంటివాటిని మీరు ఎంపిక చేసుకుంటే మంచిది. అలాగే.... కాస్త చామనఛాయగా ఉన్నవారికి లేత గోధుమ రంగు ముత్యాలు బాగుంటాయి. |
| |
స్త్రీల అందాలను పెంచే అనేక ఆభరణాలు ఎన్ని ఉన్నప్పటికీ ముత్యం విలువ ముత్యానిదే. బంగారు నగలు ఎన్ని ఉన్నాకూడా ముత్యాలను చూసిన వెంటనే మనసు పారేసుకోనివారు ఎవరుంటారు చెప్పండి. ప్రత్యేకించి మన రాష్ట్రంలోని హైదరాబాద్‌లో దొరికే ముత్యాలంటే మహిళలకు మరీ ఇష్టం.
ఇష్టం కదా అని వేటిని పడితే వాటిని కొనేసుకోవడం మంచిది కాదు. వాటిని కొనుక్కునేముందు కొనేవారి ముఖాకృతికి తగినట్లుగా ఎంపిక చేసుకుంటే మంచింది. వీటిని కొనేటప్పుడు కొన్ని మెళకువలను పాటిస్తే.... అందమైన, అద్భుతమైన ముత్యాలు మీ సొంతమవుతాయి. వాటిని అందంగా అలంకరించుకుని మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. మీరలా ప్రత్యేకంగా కనిపించాలంటే క్రింది జాగ్రత్తలను పాటించండి.
|