నుదురు చిన్నగా ఉండేవారు కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకుంటే చూడ చక్కగా ఉంటారు. అలాగే వెడల్పు నుదురు ఉండేవారికి గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. అదే నుదురు పెద్దగా ఉండేవారైతే బొట్టును కనుబొమల మధ్య కాకుండా, కొంచెం పైకి పెట్టుకుంటే అద్భుతంగా ఉంటారు. అలాగే పెద్ద బొట్టును పెట్టుకుంటే నుదురు పెద్దగా ఉన్న విషయం అంతగా తెలీకుండా చేస్తుంది.
తెల్లని మేనిఛాయ కలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా వుంటుంది. చామనఛాయ లేదా అంతకన్న కాస్త రంగు తక్కువగా వున్నవారైతే పింక్, ఆరంజ్, గంధపురంగు, లేత గులాబి రంగు, ఎరుపు రంగు బొట్టు చూడచక్కగా ఉంటాయి. కళ్లు పెద్దవిగా ఉన్నవారు పెద్ద బొట్టును, చిన్నవిగా ఉన్నవారు చిన్నబొట్టును పెట్టుకుంటే చాలా బాగుంటారు.
చిన్నవారికైతే రకరకాల ఆకృతులు, మ్యాచింగ్‌లు కలిగి ఉన్న బొట్టులను పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మధ్యవయస్సు వారు, పెద్దవారు మాత్రం ఎరుపు, పింక్ రంగుల్లో ఉండే పెద్ద, గుండ్రని బొట్లు మరింత నిండదనాన్నిస్తాయి. |