సీజన్ మారే ప్రతిసారీ అతివ పాదాల చర్మం పొడిబారి పగుళ్లు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, కాలుష్యం ప్రభావం లాంటివి పాదాల మీద ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి, సీజనల్‌గా జరిగే మార్పుల సమయంలో కూడా మీ పాదాలను కోమలంగా ఉంచుకోవాలంటే... ఇలా చేయండి.
పాదాలకు కొబ్బరినూనెతో మర్దనా చేసిన తరువాత, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత పాదాలను నీళ్లలో నుండి తీసివేసి, శుభ్రమైన పొడి బట్టతో బాగా తుడిచి... గోరింట, మందార పువ్వుల రసం, నిమ్మరసంలను సమపాళ్లలో తీసుకుని కలిపి పాదాలకు పట్టించాలి. ఆరిన తరువాత తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు డ్రైవాష్ అయి శుభ్రమై అందాన్ని సంతరించుకుంటాయి. | | వేసవికాలంలో బయటకు వెళ్లేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుని వెళితే పగుళ్లనుండి రక్షించుకోవచ్చు. అలాగే, రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్ క్రీమ్ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి... |
| |
అలాగే పాదాలు, మోచేతుల వద్ద చర్మం గట్టిపడి, గరుకుగా మారినప్పుడు... ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను సమపాళ్లలో కలిపి మర్ధనా చేయాలి. శీతాకాలంలో వారానికి రెండుసార్లు, ఎండాకాలంలో వారానికి ఒకసారి ఇలా చేస్తే పాదాలు, మోచేతులు మృదువుగా మారుతాయి.
పాదాల పగుళ్లు తగ్గాలంటే.... పారాఫీన్ వాక్స్‌లో (ఇది కాస్మొటిక్ ఉత్పత్తులు అమ్మేచోట దొరుకుతుంది) ఆరు చుక్కల ఆముదం కలిపి రాత్రి పడుకోబోయేముందు పాదాలకు పట్టించాలి. ఇలా వారం, రెండువారాలపాటు చేస్తే పాదాలు అందంగా తయారవుతాయి.
|