వేసవికాలంలో బయటకు వెళ్లేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుని వెళితే పగుళ్లనుండి రక్షించుకోవచ్చు. అలాగే, రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్ క్రీమ్ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
ఇక పాదాలు, మోచేతులపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మకాయ తొక్కతో రుద్ది చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. అలాగే... పక్షం రోజులకు ఒకసారి పాదాలకు పెడిక్యూర్ చేసుకోవాలి. అంతేగాకుండా, స్నానం పూర్తయిన తరువాత పమిస్ స్టోన్‌తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుదనం సంతరించుకుంటాయి.
అతివలూ...! పైన చెప్పిన చిన్నపాటి మెళకువలను పాటించారంటే మీ చరణాలు చూడచక్కగా, అందంగా, కోమలంగా తయారవుతాయి. సో.... ప్రయత్నించి చూడండి మరీ...! |