ఈనాటి స్పీడ్ యుగం అమ్మాయిలు ప్యాషన్లకు అలవాటుపడి వీపు భాగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిన విషయమే...! అందంగా, నున్నగా, తెల్లగా ఉండే వీపు కోసం వీరు తహ తహలాడుతున్నారు. వీపు భాగం అందంగా కనిపించేలా వస్త్రధారణలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. బ్లౌజ్‌లకు, చుడీదార్లకు, మిడీ టాప్స్ ఇలా అన్నింటి వెనుకభాగంలో రకరకాల డిజైన్లతో కుట్టించుకుంటున్నారు.
అందం గురించి అనేక జాగ్రత్తలు తీసుకునేవారు కూడా కొన్ని సమయాల్లో వీపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయడం వల్ల వీపు భాగంలో చర్మం ఛాయ తగ్గి, నిర్జీవంగా తయారవుతుంది. ఇక చలికాలంలో అయితే చర్మం పొడిబారిపోయి తెల్లగా పొట్టు రాలుతుంది. ఇలాంటప్పుడు ఎంతో ఖర్చుపెట్టి నచ్చిన డిజైన్లతో కుట్టించుకున్న టాప్స్, బ్లౌజ్‌లు వేసుకోలేరు. | | వీపు పై భాగంలోని మెడమీది ముడతలను నివారించాలంటే మెడ వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల ఒత్తిడులు, ఉద్వేగాలు కూడా దూరమై చర్మం మరింత అందంగా తయారవుతుంది. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపండి. ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రివేళ... |
| |
కాబట్టి, వీపు ఎప్పటికప్పుడు అందంగా, కాంతివంతంగా ఉండాలంటే... కింది జాగ్రత్తలను పాటించండి. మార్పును మీరే గమనిస్తారు. దీనికోసం చేయాల్సిందల్లా...!
చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించే ప్రయత్నం చేయండి. దీనికి స్క్రబ్బర్ బాగా పని చేస్తుంది. ఇందుకు కొంచెం గరుకుగా ఉండా బియ్యంపిండి, సున్నిపిండిని తీసుకుని రుద్దితే మృతకణాలను తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.
సూర్యరశ్మికి ముఖంతో పాటు ఎక్కువగా గురయ్యేది వీపు భాగమే కాబట్టి, డీప్ నెక్, స్ట్రిప్స్ ఉన్న బ్లౌజ్‌లు, చుడీదార్లు వేసుకుంటే వీపు నల్లబడుతుంది. ఈ నల్లబడ్డ వీపుకు వారానికి ఒకసారి బ్లీచ్ చేసుకుంటే మంచిది. అలాగే, వీపుమీద కమిలిన ప్రదేశమంతా పచ్చిపాలతో రోజూ మసాజ్ చేసుకున్నా కూడా నలుపు తగ్గిపోతుంది.
|