ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > అమ్మడి వీపు అందంగా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమ్మడి వీపు అందంగా...!
అలాగే వీపు పై భాగంలోని మెడమీది ముడతలను నివారించాలంటే మెడ వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల ఒత్తిడులు, ఉద్వేగాలు కూడా దూరమై చర్మం మరింత అందంగా తయారవుతుంది. మెడకు వ్యాయామమేకాక అక్కడే ఎక్కువగా చేరే మురికి వదిలిపోతుంది.

కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భుజాలు, మెడ నిటారుగా ఉంచడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం రెండు సార్లు మూడు నాలుగు నిముషాలు మెడ పైకి ఎత్తడం వంచడం ఆ పక్కకు, ఈ పక్కకు తిప్పడం చేస్తూండండి. మెడకండరాలు చక్కగా పనిచేస్తాయి.

కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపండి. ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రివేళ పడుకునేటప్పుడు మెడకు రాయండి. ఉదయాన్నేలేచి శుభ్రం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మెడ మెరిసిపోతూ ఆకర్షణీయంగా తయారవుతుంది.

ఇకపోతే... వ్యాయామానికి, ఆరోగ్యకరమైన చర్మానికి సంబంధం ఉందన్నది అందరూ ఒప్పుకునే సత్యమే. వ్యాయామంతో రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. తద్వారా బలమూ, శక్తి కూడా లభిస్తాయి. రక్తప్రసరణ పెరిగి దేహానికి బాగా ఆమ్లజని లభించడంవల్ల వయసుతోపాటు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి వీపు అందాన్ని పెంచే మెడపైన కూడా ముడుతలు రాకుండా ఉండేందుకు పైన చెప్పిన చిట్కాలను, వ్యాయామాలను ఆచరిస్తారు కదూ...!
<< 1 | 2 
మరిన్ని
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
అతివల అధర సౌందర్యం కోసం...!
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!