అందంగా కనిపించాలని ప్రతి మహిళా ఉబలాటపడుతుంది. అయితే అందరూ పుట్టుకతోనే అందగత్తెలు కారు కదా..! ఎక్కువమంది చూడటానికి సామాన్యంగా ఉంటారు. వీరు తమ అందానికి కొద్దిగా మెరుగుల దిద్దుకుంటే అందంగా కనిపిస్తారు. మరికొంతమంది పుట్టుకతోనే అందగత్తెలుగా ఉంటారు. కానీ ఎంతటి అందగత్తెలైనా సరైన అలంకరణ చేసుకోకపోతే పేలవంగా, నిర్జీవంగా కనిపిస్తారు. | | చర్మం రంగును బట్టి పౌడర్ షేడ్‌ను ఎంపిక చేసుకుంటే అందం ఇనుమడిస్తుంది. మేకప్ ఎక్కువసేపు నిలిచేందుకు కూడా పౌడర్ ఉపయోగపడుతుంది. ఫేస్ పౌడర్ పొడి రూపంలోనూ, కాంపాక్ట్‌గానూ లభిస్తుంది. ఫౌండేషన్, క్రీమ్‌కు తగ్గట్లుగా మేకప్‌ను పౌడర్ సర్దుతుంది... |
| |
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ఆత్మ విశ్వాసం జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటుంది అన్నది ఈ కాలంలో అందరి నోళ్లలోనూ నానుతున్న విషయం. ఈరోజుల్లో అందం ఎంత ప్రాముఖ్యం వహిస్తోందో అర్థం చేసుకోవాలంటే... మగవాళ్లు కూడా తమ అందాలకు మెరుగులు దిద్దుకునేందుకు మెన్స్ బ్యూటీపార్లర్‌లకు పరుగులెత్తడాన్ని చెప్పుకోవాలి.
ఇకపోతే చూడగానే కొట్టొచ్చినట్లు కనిపించేది ముఖం. ముఖానికి మెరుగులు దిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించేది పౌడర్. తగినంత పౌడర్‌ను ముఖానికి రాసుకుని బొట్టు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఎలాంటి మేకప్ దానికి సరిరాదు. అయితే ఈ పౌడర్ ఎంపికలో కూడా కాస్తం జాగ్రత్త వహించాలి.
|