ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > "పౌడర్‌"తో ముఖ సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
చర్మం రంగును బట్టి పౌడర్ షేడ్‌ను ఎంపిక చేసుకుంటే అందం ఇనుమడిస్తుంది. మేకప్ ఎక్కువసేపు నిలిచేందుకు కూడా పౌడర్ ఉపయోగపడుతుంది. ఫేస్ పౌడర్ పొడి రూపంలోనూ, కాంపాక్ట్‌గానూ లభిస్తుంది. ఫౌండేషన్, క్రీమ్‌కు తగ్గట్లుగా మేకప్‌ను పౌడర్ సర్దుతుంది.

కాంపాక్ట్ పౌడర్ వాడితే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది కానీ చర్మం త్వరగా జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి, ఆయిలీ స్కిన్ తత్వం కలవాళ్ళు కాంపాక్ట్ పౌడర్ వాడకపోవటమే మంచిది. అయితే పొడి చర్మం గల వారికి మాత్రం ఈ పౌడర్ చక్కగా నప్పుతుంది. జిడ్డు చర్మానికైతే ఫేస్ పౌడర్ సరిపోతుంది.

పౌడర్ రాసుకునేటప్పుడు మేకప్ బ్రష్‌తో కింద నుంచి పైకి, పై నుంచి కిందకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పౌడర్ ఒక దగ్గర ఎక్కువ, మరో దగ్గర తక్కువ కాకుండా సమంగా అంటుకుంటుంది. పౌడర్ రాసుకోవడానికి ముందు వేసుకునే ఫౌండేషన్ క్రీమ్‌ను ప్యాచెస్ లేకుండా అప్లయ్ చేసుకుంటే మంచిది.
<< 1 | 2 
మరిన్ని
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
అతివల అధర సౌందర్యం కోసం...!