ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
Shoba
FileFILE
"ఎర్రని మేనిఛాయ" అనేది పాతకాలం నాటి మాట. ఇప్పుడు ఆత్మవిశ్వాసం, బోల్డ్‌నెస్, గ్లామరస్ లుక్, పాజిటివ్ ఆలోచనలు లాంటివి ఎరుపు రంగు స్థానాన్ని ఆక్రమించేశాయి. ఇప్పుడు మహిళలే కాదు, పురుషులు కూడా అందం అంటే కేవలం ఎర్రటి మేనిఛాయ మాత్రమే అని భావించటం లేదు.

మహిళల్లో సహజమైన తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో కూడిన స్వభావం, పాజిటివ్ థింకింగ్, సహకరించే మనస్తత్వం లాంటివి ఇప్పుడు "ఎరుపు"ను పక్కన పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం సౌందర్య కొలమానంలో, సౌందర్య పోటీలలో కళ్ళు, ఫిగర్, చిరునవ్వు లాంటివి ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రంగు ముఖ్యం కాదు...!
  శరీర ఛాయ నల్లగా ఉందా, ఎర్రగా ఉన్నదా అనేది కాదు. ఎల్లప్పుడూ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, అందమైన ముఖంతో పాటుగా పనిలో నిర్ధారిత లక్ష్యాలను సాధించే నేర్పు అవసరం. ఎరుపైనా, నలుపైనా తమలో ఉన్న పాజిటివ్ అంశాలవైపు దృష్టి సారిస్తే... ఎవరికి వారే "అందాల మహారాణులు...      


ముఖం, కళ, ఫిగర్, హెయిర్ స్టయిల్, నడకతీరు, వ్యక్తిత్వం లాంటివన్నీ ప్రస్తుతం మహిళల అందానికి నిదర్శనంగా నిలబడుతున్నాయి. ఆకర్షణీయం ఉండాలంటే మహిళల శరీర ఛాయ ఎర్రగా ఉండాల్సిన అవసరం లేదు కానీ... శరీరాన్ని మాత్రం చురుకుగా కదిలేలా తయారు చేసుకోవాలి.

అందాల పోటీలకే కాదు, ఉద్యోగాలకైనా సరే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే కనుముక్కు తీరు ఉండటం ముఖ్యం. అంతేగానీ శరీర ఛాయ నల్లగా ఉందా, ఎర్రగా ఉన్నదా అనేది కాదు. ఎల్లప్పుడూ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, అందమైన ముఖంతో పాటుగా పనిలో నిర్ధారిత లక్ష్యాలను సాధించే నేర్పుతో ఉంటే సరిపోతుంది.

ఇకపోతే మనం ధరించే దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి దుస్తులను సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటి రంగు, డిజైన్ లాంటి వాటిల్లో జాగ్రత్త వహించాలి. ఎరుపైనా, నలుపైనా తమలో ఉన్న పాజిటివ్ అంశాలవైపు దృష్టి సారిస్తే... ఎవరికి వారే "అందాల మహారాణులు" అవుతారనడంలో సందేహం లేదు.
మరిన్ని
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!