ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
Shoba
FileFILE
ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య అవాంఛిత రోమాలు. కొంత మంది మహిళలకు గడ్డం మీద, పైపెదవిపైన, నుదిటిపైన, బుగ్గలపైన, కనుబొమ్మలపైన అవాంఛిత రోమాలు ఉండటం వల్ల నలుగురిలోకి వచ్చేందుకు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు కింది జాగ్రత్తలు పాటించటం ద్వారా... వాటిని శాశ్వతంగాను, తాత్కాలికంగాను తొలగించుకునే అవకాశం కలదు.
వ్యాక్సింగ్ అనువైన పద్ధతి!
  అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి. చర్మాన్ని చల్లని నీటితో కడిగి... ఐస్‌క్యూబ్‌తో...      


ముఖంపై ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించేందుకు అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని కలిపి బ్లీచింగ్‌ చేసుకుంటే మంచింది. ఇలా చేయడానికి ముందుగానే అలర్జీ వచ్చే ప్రమాదముందేమో చెక్ చేసుకోవాలి. దీనికిగాను మిశ్రమాన్ని ఒక చోట కొద్దిగా పూసి పరీక్షించుకోవాలి. ఇలా చేసుకునే బ్లీచింగ్ పదిహేను రోజుల గ్యాప్‌తో చేసుకుంటే మంచిది.

ఇక చేతులు, కాళ్ళపై వుండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి తీసివేయాలి. పొత్తికడుపు, గుండెలపైన, మెడకింద భాగాల్లో వచ్చే రోమాలను మాత్రం వాక్స్ లేదా బ్లీచ్ చేయడం ద్వారా తొలగించాలి. కనుబొమలు, పై పెదవిపై ఉండే రోమాల్ని ప్లక్కింగ్ ద్వారా తొలకించిన తరువాత యాంటీ సెప్టిక్ లోషన్ రాసుకోవడం మరవవద్దు.

మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవర్స్ వాడేటప్పుడు వాటి మీద ఉండే సూచనలను తప్పకుండా చదివి, అలర్జీ వస్తుందేమో పరీక్షించుకున్న తరువాతే వాడాలి. ఇకపోతే ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే... హెయిర్ రిమూవర్స్‌ను ముఖానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
1 | 2  >>  
మరిన్ని
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!