అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడిగి... ఐస్‌క్యూబ్‌తో చర్మం అంతా రుద్దాలి. ఇలా చేస్తే... పొక్కులు, దద్దుర్ల బెడద ఉండదు. వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత రెండు రోజులపాటు వదులుగా ఉండే నూలు దుస్తులు మాత్రమే ధరించాలి.
సున్నిత చర్మతత్వం ఉన్నవారు కోల్డ్‌వ్యాక్స్ చేయించుకోవాలి. హాట్ వ్యాక్స్ బంగారు వర్ణంలో ఉంటుంది. మరీ ముదురుగా ఉంటే బాగా వేడెక్కిందని అర్ధం. వ్యాక్సింగ్ చికిత్స చేయించుకుంటున్న గది కాస్త చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ పాటించి చూడండి... అందమైన, నునుపైన చర్మం మీ సొంతమవుతుంది. |