ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
నలుచదరంగా, దవడ ఎముకలు వెడల్పుగా ఉండేలా ముఖం కలిగిన వారు జట్టు చెంపలను కవర్ చేసే విధంగా హెయిర్ స్టయిల్ చేసుకోవాలి. జుట్టు మొత్తాన్ని కలిపి బ్యాండ్ కానీ, క్లిప్ కానీ వేసినా, జడకానీ వేస్తే... దవడ బయటకు వచ్చినట్లుగా కనిపిసూ ఉంటుంది. దీనివల్ల ముఖం అందంగా అనిపించదు కాబట్టి, దవడ స్పష్టంగా కనిపించకుండా ఉండేలా జుట్టు పాయలు కప్పేటట్లుగా దువ్వుకోవాలి.

ఇక దీర్ఘ చతురస్త్రాకారం కలిగిన ముఖం వారికైతే... స్టైలిష్ హెయిర్ స్టయిల్ బాగుంటుంది. వీరు జుట్టు ఒక లేయర్ నుదుటి మీదకు వచ్చేటట్లుగా కత్తిరించుకోవాలి. జడకుకానీ, పోనీటైల్‌కు గానీ జుట్టు మధ్యలో పాపిడి తీయకూడదు. పక్కపాపిడి కానీ, ముందు కొంత జుట్టును నుదుటిని కప్పేటట్లుగా వదిలేసి కానీ దువ్వుకోవటం మంచిది. అలాగే... క్లిప్పులు, బ్యాండ్‌లు వేయకుండా జట్టును వదిలేసేటట్లయితే ఒక వైపు ముఖం మీదకు వచ్చేటట్లుగా చూసుకోవాలి.

త్రికోణాకారం ముఖం కలిగిన వారికైతే... మెడదాకా ఉండే హెయిర్ కట్ అయినా, పొడవుగా ఉండే హెయిర్ స్టయిల్ అయినా చక్కగా ఉంటుంది. అయితే జుట్టును చెవుల వెనక్కి తోసివేసేలా ఉండే హెయిర్ స్టయిల్ మాత్రం వీరికి బాగుండదు. చెవులను కప్పివేస్తూ... చూసే వాళ్ల దృష్టి నేరుగా కళ్లమీద కేంద్రీకృతమయ్యేలా ఉంటే చూడచక్కగా ఉంటారు.
<< 1 | 2 
మరిన్ని
అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!