"ఏంటీ... ఊగితేనే బరువు తగ్గిపోతారా..!" అని కొట్టిపారేయకండి. ఊయల్లో ఊగితే నిజంగానే బరువు తగ్గిపోతారు. ఉయ్యాల ఊగడం పిల్లలకు, పెద్దలకు ముఖ్యంగా మహిళలకు కూడా ఒక మంచి వ్యాయామం కాగలదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఉయ్యాల పసిపిల్లల ఆటగానే ఇన్నాళ్లూ భావిస్తున్నప్పటికీ, ఇది పెద్దలకు కూడా ఒక మంచి వ్యాయామమని నిపుణులు అంటున్నారు.
ఊబకాయంతో బాధపడే మహిళలు అరగంటసేపు ఉయ్యాలలో ఊగుతూ, వంగుతూ శరీరానికి వ్యాయామం కలిగిస్తే... కొన్ని వారాలకే ఆరోగ్యకరంగా, ఉత్సాహంగా, తేలికగా తయారవుతారంటే ఆశ్చర్యపడాల్సింది లేదని నిపుణులు చెబుతున్నారు. | | మహిళలకు ఈ ఉయ్యాల వ్యాయామం చాలా మంచిది. దీనివల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. చేతుల లావుతగ్గి చక్కటి ఆకృతిని పొందుతారు. భుజాలు దృఢంగా తయారవుతాయి. ఛాతి పటిష్టంగా తయారవుతుంది. పిరుదులు, తొడలు దృఢంగా మారుతాయి. శరీరం కూడా తేలికగా, ఉత్సాహంగా తయారవుతుంది... |
| |
ఉయ్యాల ఊగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.... ఉయ్యాల బల్లపై కూర్చుని ఒక కాలు ముందుకు, మరో కాలు వెనక్కి పెట్టి ఊగాలి. అలాగే.. పొట్ట భాగాన్ని లోపలికి పోనిచ్చి, తాడుకు మోచేతులను ఆన్చాలి. అలాగే తాడు పట్టుకుని కొద్దిగా వెనక్కి వెళ్ళి మోచేతులతో ఒత్తిడిని ప్రయోగించి తాడు సహాయతో ముందుకు ఊగాలి. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచి ఇలా పది నిమిషాలపాటు క్రమపద్ధతిలో ఊగితే 42 కేలరీలవరకూ ఖర్చవుతాయి.
ఇకపోతే... శరీర బరువునంతటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేగంగా ఊగడంవల్ల నడుము కింది భాగం గట్టిపడుతుంది. ఇలా చేసేటప్పుడు వీపుని నొక్కి పట్టుకుని కొద్దిగా.. వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ముందుకు గట్టిగా ఊగాలి. వేగంగా ఊగుతూ బాగా పైకి వెళ్లడం ఎంతో ధ్రిల్లింగ్‌గా ఉండటమే కాదు దీనివల్ల శరీర కండరాలన్నిటిపైనా ఒత్తిడి బాగా పడుతుంది. ఇలా పది నిమిషాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతాం.
|