ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > ఊగండి... బరువు తగ్గండి..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఊగండి... బరువు తగ్గండి..!
ఉయ్యాలపై సవ్య, అపసవ్య దిశల్లో ఊగడం వల్ల ఏర్పడే కదలికలతో శరీరంలో కేలరీలు తగ్గుతాయి. ఊగేప్పుడు వేగంగా ఎత్తుకుపోకూడదు. అలా చేసినట్లయితే కళ్లు తిరుగుతాయి కాబట్టి, మధ్యమధ్యలో ఊగే దిశలను మార్చుతుండాలి. పరిగెత్తినపుడు కాళ్లకు ఎలాంటి వ్యాయమం అవుతుందో, ఊగడం వల్ల కూడా అదే ఫలితం ఉంటుంది.

ఉయ్యాలను ముంజేతులతో తోస్తూ ఊగితే పుషప్స్ చేస్తే వచ్చే ప్రయోజనాలు కలుగుతాయి. ఊగుతూ బాగా ఎత్తు వరకూ వెళ్లడం వల్ల చేతులు, భుజాలు, వెన్ను, కాళ్ల భాగాలకు ఒకే సమయంలో మంచి వ్యాయామం అవుతుంది. ఊగేటప్పుడు వంగటం, లేవడం వల్ల క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా పదినిమిషాలపాటు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

మహిళలకు ఈ ఉయ్యాల వ్యాయామం చాలా మంచిది. దీనివల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. చేతుల లావుతగ్గి చక్కటి ఆకృతిని పొందుతారు. భుజాలు దృఢంగా తయారవుతాయి. ఛాతి పటిష్టంగా తయారవుతుంది. పిరుదులు, తొడలు దృఢంగా మారుతాయి. శరీరం కూడా తేలికగా, ఉత్సాహంగా తయారవుతుంది.
<< 1 | 2 
మరిన్ని
హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు