ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > ఇంట్లో వస్తువులతోనే మొటిమలకు గుడ్‌బై..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంట్లో వస్తువులతోనే మొటిమలకు గుడ్‌బై..!
Shoba
FileFILE
సౌందర్య పోషణ మనకు కొత్తేమీ కాదు. ప్రాచీన కాలం నుంచీ మనకు సౌందర్య సాధనాల వాడకం తెలిసిందే కాబట్టి... సాధ్యమైనంత వరకూ సహజంగా ప్రకృతిలో లభించే వస్తువుల మీద ఆధారపడటం శ్రేయస్కరం. సాధారణంగా టీనేజ్‌లోకి వచ్చిన మహిళల ప్రధాన సమస్య మొటిమలు. అయితే ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం ఎవరినీ వదిలిపెట్టడం లేదన్నది సంగతి అందరికీ ఎరుకే...!

అలంకరణలో కానీయండి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నివారణలో గానీయండి... ప్రకృతిలో లభించే పదార్థాల ఉపయోగం అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగా టీనేజ్ అమ్మాయిలను వేధిస్తోన్న మొటిమల బాధ నుండి విముక్తులను చేయాలంటే... ఇలా చేసి చూడండి.
కొత్తిమీర రసంలో...!
  కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం...      


ముల్లంగిని మెత్తగా నూరుకుని అందులో రెండు టీస్పూన్ల నిమ్మరసం, అంతే మోతాదులో టమోటో రసం కలిపి ముఖానికి పట్టించండి. అలాగే పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టి, ఆపై చల్లని నీటితో కడగాలి. ఇలా వారం రోజులపాటు రోజుకొకసారి చేస్తే... మెటిమలు, వాటి కారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

మొటిమల బాధ తగ్గినప్పటికీ పై ముల్లంగి ప్యాక్‌ను వారానికొకసారి వేసినట్లయితే... చర్మరంధ్రాలు శుభ్రపడటమే గాకుండా, మెటిమలు రాకుండా ముఖం తేటగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

అలాగే... ముల్లంగిని మిక్సీలో రుబ్బుకుని పూర్తిగా రసం తీసుకోవాలి. 20 యంఎల్ రసానికి అంతే మోతాదులో మజ్జిగ కలిపి ముఖానికి పట్టించి, గంట సేపటి తరువాత వేడినీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మగ్రంథుల నుంచి విడుదలయ్యే అదనపు జిడ్డును తొలగించి, బ్యాక్టీరియా నిరోధిస్తుంది. ఇలా వారం రోజులపాటు చేస్తే కొత్త మొటిమలు రావు, అప్పటికే ఉన్నవి కూడా మానిపోయి చర్మం నున్నగా తయారవుతుంది.
1 | 2  >>  
మరిన్ని
ఊగండి... బరువు తగ్గండి..!
హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!