సౌందర్యాన్ని పెంపొందించుకోవడం అంటే బ్యూటీపార్లల్ మాత్రమే దృష్టిలో పడితే జేబులు ఖాళీ కావటం ఖాయం. ఇంట్లో మనం వంటకు వాడే కూరగాయలు, తీసుకునే పళ్లతో కూడా సౌందర్య పోషణ చేసుకోవచ్చు. పైగా దీనికి పెద్దగా ఖర్చు కాదు కూడా. మెడ, మోచేతులు, బాహుమూలలు నల్లగా ఉంటే.. రోజూ నిమ్మరసంలో అంతే మోతాదులో కీర రసం, చిటికెడు పసుపు కలిపి రాయాలి. దీంతో నలుపు మాయమవుతుంది. ముఖం మీద సన్నటి వెంట్రుకలు ఉంటే ఎవరికయినా మహా ఇబ్బందే మరి. దీనికోసం కోడిగుడ్డులోని తెల్లసొనలో చక్కెర మొక్కజొన్న పొడి, లేదా వరిపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత మూడూ నాలుగు సార్లు చొప్పున వరుసగా రెండు మూడు నెలలు చేస్తే వెంట్రుకలు పూర్తిగా పోతాయి.టమోటా రసం, తేనె సమపాళ్లలో కలిపి ముఖానికి మెడకు పట్టించి పదిహేను నిమిషాలపాటు కడిగివేయాలి. దీంతో ముఖం, మెడ కాంతులీనతాయి. పులిపిర్లు పోవాలంటే ప్రతిరోజూ కాలిప్లవర్ రసం రాయాలి. చర్మం మీద ఉన్న మచ్చలుపోవాలంటే క్యారట్ రసం రాసి మర్దన చేస్తే చాలు తగ్గుతాయి. |