కార్యాలయానికి వెళుతుంటే కాటన్ చీర: కాటన్ చీర అన్ని వేళల్లో మన్నుతుంది. ముఖ్యంగా దీనిని కార్యాలయాలలో పని చేసేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే శృంగార పరంగా కనపడుతుంది.
ముఖ్యంగా కాటన్ చీర ధరించేముందు దానిని ధరించే విధానం తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు సన్నగా ఉన్నాకూడా దానిని కట్టేవిధానంతో లావుగా కనపడే ఆస్కారం ఉంది. కాబట్టి కాటన్ చీర కట్టే విధానాన్ని కూడా నేర్చుకోవాలంటున్నారు సౌందర్యోపాసకులు. కాస్త రిచ్‌గా కనపడాలంటే : పట్టు చీరలు ధరించండి
మహిళల డ్రస్సులు రకరకాలుగా ఉంటాయి. వారికి ఎలాంటి డ్రస్సులైనా బాగా నప్పుతుంది. దీంతో మహిళలు ధరించే దుస్తులకే అందం వస్తుంది. ఇందులో రిచ్‌గా కనపడాలంటే పట్టు చీరలు ధరించండి. వీటిని మీరు కార్యాలయాలకు లేదా ఫంక్షన్‌లకు వెళ్ళేటప్పుడు వీటిని ధరిస్తే చాలా రిచ్‌గా కనపడుతారు.
కార్యాలయాలకు వెళ్ళేవారు కేవలం బార్డర్ ఉండే పట్టు చీరలను ధరించండి. అదే పార్టీలకు లేదా ఫంక్షన్‌లకు వెళ్ళేటప్పుడు ఎంబ్రాయిడరీ సిల్క్ చీరలను ఎంచుకొని ధరించి వెళ్ళండి. దీంతో అందరి దృష్టి మీ పైనే ఉంటుంది. |