భారతీయ మహిళలు ధరించే దుస్తుల్లో కూడా స్టైలిష్ తీసుకురావచ్చు. దీనికి కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తే సరిపోతుంది. దేశీయ మహిళలు ధరించే దుస్తుల్లో సాంప్రదాయం ఉట్టిపడుతుంది. వీటిని ధరించేటప్పుడు కొన్ని కొత్త-కొత్త ప్రయోగాలు చేస్తే పాశ్చాత్య తరహాలో వాడుకోవచ్చు. ఈ మార్పు మీకోసం. మీరుకూడా దీనిని పాటిస్తే చాలా బాగుంటుంది. ప్రయత్నించి చూడండి. వాటికి కొన్ని చిట్కాలు...మీ కోసం...!
** ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా స్లైక్స్ ఫ్యాషన్ వచ్చింది. ఈ ఫ్యాషన్‌ను ఇదివరకు వాడేవారు. మీరుకూడా మీ వస్త్రధారణలో మార్పు తీసుకురావడానికి షార్ట్ షర్ట్‌లను ధరించడంతోబాటు స్లైక్స్, లాగింగ్స్ లేదా టైట్స్ ధరించి చూడండి.
** మీరు హై వెస్ట్ షర్ట్‌లు, రోల్డ్ అప్ స్లీవ్స్‌తోబాటు ఓ అందమైన స్టోల్ ధరించి చూడండి. మీలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
** నిత్యం చూడీదార్ సల్‌వార్‌లు వాడుతుంటారు. వీటికి బదలుగా మీరు స్లైక్స్ లేదా జీన్స్ ధరించి చున్నీ స్థానంలో అందమైన స్టోల్ లేదా స్కార్ఫ్ ధరించి చూడండి. మీరు మరింత అందంగా కనపడుతారు. అది మీకు మాడ్రన్ లుక్‌లా కనపడుతుంది.
** మీరు స్లీవ్‌లెస్ షర్ట్‌తోబాటు జీన్స్ ధరించండి. మీకు చాలా బాగుంటుంది. |