ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » అందానికి అందం, పెరుగుతో మీ సొంతం (Curd | beauty | skin | food | health | shampu |)
Bookmark and Share Feedback Print
 
మనం తీసుకునే ఆహార పదార్థాలలో అన్ని రకాల పోషక విలువలుండే ఆహార పదార్థాలుంటాయి. ఇవి శరీర సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇందులో ప్రధానంగా పెరుగుకూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో చాలా రకాల లాభాలున్నయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే శరీర చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు పెరుగు దట్టించి తలస్నానం చేస్తే కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. పెరుగులో బేసన్ కలిపి నలుగుపిండిలాగా శరీరానికి పూస్తే శరీరంలో పేరుకుపోయిన మలినాలు మటుమాయమవుతాయి. పెరుగులో తేనెను కలిపి వెంట్రుకలకు పూస్తే ఇది కండీషనర్‌లాగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీర చర్మంపై పూస్తే ఇది క్లీజింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.