మీకు తరచూ కోపం వస్తుంటే శరీరంలో ఒత్తడి పెరిగిపోతుంది. అప్పుడు శరీరంలో ఎడ్రినలీన్ రసాయనం విడుదలవుతుంది. ఇది శరీరంలో దాదాపు 18 గంటలవరకు ఉంటుందంటున్నారు వైద్యులు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కోపాన్ని తగ్గించుకుంటే అందంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోపం వలన అనారోగ్యం పెరుగుతుంది.
ఈ రసాయనాన్ని మీరు శరీరంలోనుంచి తొలగించాలంటే వ్యాయామం చేయండి. దీనికి పగటిపూట సమయం (ఉదయంపూటైతే మరీ మంచిది) కేటాయించండి. లేదా వేగంగా నడక ప్రారంభించండి. ఇలా అరగంటపాటు చేయండి.
మీరు కోపంగా ఉన్నప్పుడు ఇలా చేయండి. దీంతో కోపంనుంచి ఉపశమనం కలుగుతందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
** కోపం వచ్చినప్పుడు బిగ్గరగా అరవకండి. ** అంకెలను వంద వరకు ఎంచండి. ఆ తర్వాత పదిసార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి.
** కోపం వచ్చినప్పుడు అలా వ్యాహాళికోసం బయటకు వెళ్ళండి.
** మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. ఒక గ్లాసు చల్లటి నీటిని సేవించండి. చెదిరిన మీ ముంగురులను ఓ సారి సరిచేసుకునేందుకు అద్దం ముందుకు రండి. మీ ముఖాకృతిని అద్దంలో బాగా పరిశీలించండి. దీంతో మీ కోపం తగ్గిపోతుంది.
** కోపం కలిగినప్పుడు ప్రశాంతంగా సంగీతం వినండి. ఏ విషయమైతే మీకు కోపం కలిగించిందో దానిని ఇతరులతో మాట్లాడుతూ మరిచిపోవడానికి ప్రయత్నించండి. ** మీకు యోగా చేయడం వస్తే దానిని చేయడం ప్రారంభించండి. |