** శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఎనీమియా అంటారు. ఇలాంటి జబ్బును నియంత్రించాలనుకుంటే నల్లటి ద్రాక్ష, అరటిపండు, ఉల్లిపాయలు, క్యారెట్టు, టమోటాలాంటి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావలసిన ఇనుము ఈ ఆహార పదార్థాలనుంచి లభ్యమవుతాయి.
వీలైనంత ఎక్కువగా వీటిని ఆహారంగా తీసుకుంటుండాలి. ఇలా వీటిని తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్త లేమిని దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు. |