అందంగా మెరిసిపోయేలా గోళ్లు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఇందుకోసం చిన్నపాటి చిట్కాలను పాటిస్తే సరి.గోళ్లను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకోండి. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి 3,4 నిమిషాలు వరకూ అందులో ఉంచండిగోళ్ల దగ్గర కొద్దిగా మసాజ్ చేయడం అవసరం. దీంతో అక్కడ రక్త ప్రసారం బాగా జరుగుతుంది.నెయిల్ పాలిష్ వేసుకునేముందు గోళ్లకు ఓ మంచి బేస్ కోట్ వేయండిపోషకత్వాల లేమితో కూడా గోళ్లు విరిగి పోతుంటాయి. కనుక అప్పుడప్పుడూ కాల్షియం బిళ్లలను మింగాలి.పాత్రలు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు హార్డ్ కెమికల్స్ ఉన్న సబ్బును గానీ, డిటెర్జెంటును గానీ వాడకండి. |