చాలామంది మహిళలు శరీరంలో ముందు భాగానికి ఇచ్చినంత ప్రాధాన్యం వెనుక భాగానికి ఇవ్వరు. అయితే వెనుక భాగాన్ని కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటే అందరి చూపూ వారిపైనే ఉంటుంది. ఇందుకోసం...వీపు కనబడినంత వరకూ పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. తేలికపాటి రోమాలు ఉంటే బ్లీచింగ్ చేస్తే సరిపోతుంది. అవాంఛిత రోమాలు దట్టంగా ఉంటే వాక్సింగ్ చేసుకోవాలి.వీపు మీద డ్రెస్ ఫిట్టింగ్ కూడా నప్పే విధంగా ఉండాలి. శరీరాకృతి అందాలను వెలికి తీసేదిగా ఉండాలి. వెనుకనుంచి లూజ్ ఫిట్టింగ్, కుట్లు విడిపోయి ఉండటం, బొత్తం విరిగిపోవడం, పిన్నీసు వాడటం వంటివి వ్యక్తిత్వానికి బ్యాక్ లుక్‌కి నష్టం చేస్తాయని గమనించండి. |