మొటిమలు: మొటిమలున్నవారు సాధారణంగా క్రీములు వాడుతుంటారు. అలాంటివారికి ప్రకృతిపరమైన వైద్యాన్ని సూచిస్తున్నారు వైద్యులు. యవ్వనంలోకి రాగానే అమ్మాయిలకు, అబ్బాయిలకు ముఖంపై మొటిమలు విపరీతంగా వచ్చి ముఖం అందవికారంగా తయారవుతుంటుంది. దీంతో పదిమందిలో తిరగాలన్నాకూడా వారికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంటుంది.
దీనికి చేయవలసిందల్లా ఒక్కటే... 2వందల గ్రాముల టమోటాలు-పచ్చి పసుపు రసం కలిపి సేవించాలి. ఇలా కనీసం మూడు నెలలపాటు తాగితే మొటిమలనుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
బీట్రూట్, యాపిల్, జామకాయ పండ్ల రసాలను సేవించండి. కీరకాయ, క్యారెట్, కొత్తిమిరి రసంతోపాటు ఉసిరికాయ చూర్ణాన్ని సేవించండి. దీంతో మొటిమలనుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. |