అమ్మాయిలు, మహిళలు తమ శిరోజాలపై ఎక్కువగా శ్రద్ద చూపుతుంటారు. దీనికోసం వారు రకరకాల క్రీములు, నూనెలు, జెల్‌లు, టీవీల్లో వచ్చే వివిధ ప్రకటనలలో చూపించే వాటిని వాడుతుంటారు. వివిధ రకాల మందులుకూడా వాడుతుంటారు. అయినాకూడా కొన్నిసార్లు జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. దీనిని అరికట్టాలంటే సహజమైన పద్దతులనే ఎంచుకోవాలి. ప్రకృతి సిద్ధంగాలభించే పదార్థాలనే వాడాలి దీంతో శిరోజాలు అందంగా ఏపుగా పెరుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.ఆముదం: కనీసం పది-పదిహేను రోజులకోసారి మీ జుట్టు కుదుళ్ళనుండి చివరి వరకు ఆముదపునూనెను పట్టించండి. అరగంట అయిన తర్వాత కుంకుడు కాయల రసంతో తలస్నానం చేయండి. మీకురులలో నిగారింపు వస్తుందంటున్ననారు నిపుణులు.గుడ్డు: గుడ్డులోని తెల్లసొన, రెండు చెంచాల ఆముదం, ఒక స్పూను గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయండి.తలస్నానం చేయడానికి ముందుగా ఓగంటముందు కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేసి తలకి పట్టించి గోరువెచ్చని నీటిలో తడిపిన టవల్‌ను చుట్టుకోవాలి. ఇలా ఓ గంటపాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయండి. మీ కురులు పట్టులాగా నిగనిగలాడుతుంటాయి. ఏపుగాకూడా పెరుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. |