మీ చర్మం జిడ్డోడుతుంటే బొప్పాయి గుజ్జు, పాలమీగడ, తేనె, ఓట్‌మీల్ పొడిని తగు పాళ్ళల్లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మీ చర్మం జిడ్డుతనాన్ని కోల్పోయి అందంగా తయారవుతుందంటున్నారు సౌందర్య పోషకులు.
** ద్రాక్ష పళ్ళకు కోడిగుడ్డులోని తెల్లసొన, మూడు చుక్కల నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయండి. ఇందులో మీరు కలిపిని నిమ్మరసం సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ద్రాక్ష చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కోడిగుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. దీంతో అందం ఇనుమడిస్తుంది.
పొడిచర్మం కలవారు చెంచా తేనెలో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా కూరగాయలనుంచి తీసిన నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో మీ చర్మం తాజాగా ఉండటమే కాకుండా ఇది మాయిశ్చరైజ్‌లా పనిచేస్తుందంటున్నారు బ్యుటీషియన్లు. |