ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలోనూ ముందంజలోనున్నారు. ఆధునిక యుగంలో మహిళలు ప్రతిపనినికూడా తమకు అనుకూలంగా ఉండేందుకు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా మహిళలు వాడే జోళ్లు ప్రధాన పాత్రను వహిస్తాయనడంలో సందేహంలేదు. ఇవి వారి ఆరోగ్యంపైకూడా తీవ్రమైనప్రభావం చూపిస్తుంది.
సౌకర్యంగా ఉండే జోళ్ళు: ఆధునిక మహిళలు తమకు సౌకర్యవంతంగా ఉండేవాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగా పాదరక్షలను ప్రత్యేకంగా ప్రత్యేకంగా డిజైన్ చేసినవాటినే కొనాలి. అత్యధికభాగంలో మెత్తటి లెదర్‌తోపాటు మేమరీ ఫోమ్‌ను వినియోగించినవి వాడాలంటున్నారు వైద్యులు. దీంతో వారి పాదాలు కోమలంగా ఉంటాయంటున్నారు వైద్యులు.
చిక్ : చిక్ షూ అనేటివి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇవి ఉద్యోగాలు చేసే మహిళలకు సౌకర్యవంతంగాను ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందులో మధ్యరకం, హిల్స్ రకం, వెడ్‌గెస్, ఫ్లాట్స్‌లాంటి వివిధ రకాలలో లభ్యమవుతుంటాయి.
అడ్వెంచర్ కలెక్షన్: అడ్వెంచర్ కలెక్షన్ సిరీస్‌లో హార్డ్‌కోర్‌తో ఉండి ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పర్వతారోహకులు, బయటి ప్రాంతాలలో నడిచేవారికి ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. |