1 ** రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల తేనె కలుపుకోండి. ఇందులో కాసింత చక్కెరకూడా కలపండి. ఈ మిశ్రమాన్ని కాసేపటివరకు చేతులకు మాలిష్ చేయండి. కాసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. దీంతో చేతి చర్మం మృదువుగా తయారవుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.2 ** స్నానానికి పూర్వం గోరువెచ్చనిపాలలో చేతులు మాలిష్ చేయండి. దీంతో చేతులు మృదువుగాను, నిగారింపును సంతరించుకుంటాయి. 3 ** ఒక అరటిపండును తీసుకుని దానిని బాగా గుజ్జుగా తయారు చేసుకోండి. అందులో నిమ్మకాయ రసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చేతులకు పూయండి. దీనిని ముఖంపైకూడా పూయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని, చేతులను కడుక్కోండి. దీంతో చేతులు, ముఖ చర్మం మృదువుగామారి నిగనిగలాడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. |