ప్రస్తుతం అమ్మాయిలు ఎక్కువగా చుడీదార్, జీన్స్, టీ షర్ట్, గాగ్రాలు సెలెక్ట్ చేసుకుని వాటినే వాడటం అలవాటుగా మారింది. వాటిని చిటికెలో సెలెక్ట్ చేసేసుకుంటారు. నచ్చినట్టుగా కుట్టించుకుంటారు. కానీ వీరికీ అప్పుడప్పుడూ చీర కట్టుకోవాలనుటుంది. అంతవరకూ బాగానే ఉంటుంది కానీ వీరికి చీర ఎలాంటి చీర సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కానీ స్వయంగా చీర కొనుక్కోవడంలో ఓ థ్రిల్ ఉంటుంది. వీరికి చీర గురించే కాదు వాటి ఖరీదు, మన్నిక గురించిన సందేహాలుకూడా ఎక్కువగానే ఉంటాయి మరి. మొదటిసారి చీర కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో చూద్దామా...** మీరు సెలక్ట్ చెసుకునే చీర మీ ఒంటి రంగుకు సరిపోతుందో లేదో చూడాలి.** డిజైన్ త్వరగా అవుట్ డేట్ అయ్యే ప్రమాదం ఉందేమో గమనించాలి.** కొన్ని డిజైన్‌లు ట్రెండ్ మారిన తర్వాత ధరిస్తే అంతగా అందగిచవు. ముఖ్యంగా రెయిన్‌బో చీరలు వంటివి.** ఒక చీరకు రెండు, మూడు రంగుల, వెరయిటీ బ్లవుజ్‌లు కుదిరే మోడల్ ఎంచుకుంటే, మల్టీపర్పస్‌గా పని చేస్తుంది.** ఒకే చీరకు రెండు పల్లులు కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒక పల్లు సింపుల్‌గాను, మరొకటి రిచ్‌గానూ ఉండేలా తీసుకుంటే క్యాజువల్, పార్టీ వేర్‌గా ఉపయోగపడుతుంది.** ఒక బ్లవుజ్‌కి డిజైన్‌కు నప్పే విధంగా ఏడు-ఎనిమిది రంగుల పూసలు, చమ్కీలు, సిల్క్ దారాలతో రిచ్ ఎంబ్రాయిడరీ చేస్తే పార్టీలో అందరి దృష్టి మీమీదే. ఇందులో మరో ట్రిక్ కూడా ఉంది. డిజైన్‌లో ఉన్న రంగుల ప్లెయిన్ సింపుల్ చీరలన్నింటికీ ఈ బ్లవుజ్ ధరించవచ్చు. ఒక్కో రంగు చీరతో ఒక్కో ఫంక్షన్‌కి రెడీ. |