ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » తేయాకుతో చర్మ సౌందర్యం...! (Skin care | hair care | tomato | tea | face | milk | cosmetics | skin glow)
Bookmark and Share Feedback Print
 
చర్మసౌందర్యాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలనుకుంటే మార్కెట్లో రకరకాల వస్తువులు లభ్యమవుతుంటాయి. కాని నిత్యం మనం వాడే ఆహార పదార్థాలు, వంట సరుకులతోనే ముఖారవిందాన్ని పెంచుకోవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. ప్రస్తుతం సౌందర్య నిపుణులు ఎక్కువగా టమోటా, పాలు, మీగడ, కీరలాంటి పదార్థాలను వాడమని సూచనలు ఇస్తున్నారు. ఇవి ధరలలో చౌక, అలాగే ప్రకృతి సిద్ధమైనవి. వీటిని వాడితే ముఖారవిందాన్ని పెంచుకోవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. తేయాకు.. తేయాకును ఉడకబెట్టిన నీటితో వెంట్రుకలు కడిగితే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. తేయాకును ఉడకబెట్టిన నీటిలో గోరింట కలిపి వెంట్రుకలకు దట్టిస్తే వెంట్రుకలు నిగారింపును సంతరించుకుని పట్టులా తయారవుతాయంటున్నారు బ్యుటిషియన్లు. టమోటా.. టామోటా గుజ్జును ముఖానికి పూస్తే ముఖారవిందం పెరుగుతుంది. శుభ్రమైన, తాజా, ఎర్రటి టమోటాల రసంలో మీగడ కలుపుకుని ముఖానికిపూస్తే సన్ బర్న్ నుంచి ముఖం వాడకుండా కాపాడుకోవచ్చు. మీ ముఖంపై నల్లటి మచ్చలుంటే టమోటా రసంలో ముల్లంగి రసం కలిపి ముఖానికి పూస్తే నల్లటి మచ్చలు మాయమవడమే కాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.