ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » అరటితో అందం మీ సొంతం...! (Facepack | Facial | BANANA | Block Spots | Oily Skin)
Bookmark and Share Feedback Print
 
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు లభిస్తున్నాయి. ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి, వాటిల్లో అరటిపండుతో ఫేషియల్‌ చేసుకుంటే ముఖారవిందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే పండు. ఇందులో అనేక రకాల పోషక విలువలున్నాయి. ఇలాంటి అరటి పండుతో ఫేషియల్‌ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది. చేసే విధానం.. ముదుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషియల్‌ స్టీమ్‌ తీసుకోవాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారుతుంది. ఇప్పు డు అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించుకోవాలి. మృతకణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్‌ (మసాజ్‌ క్రీమ్‌) కలిపి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. న్యూట్రిషన్‌ విలువలున్న వీటి వలన ఎండిపోయినట్టు వున్న చర్మం మృదువుగా మెత్తగా అవు తుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి, మెడకి దట్టించి 15 నిమిషాలపాటు అలానే వుంచే యాలి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే ముఖం అందంగా కనబడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.