సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఈ సుమనోహర నయనాలే ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ప్రతి రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర, సరైన ఆహారంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.
** కనుబొమ్మలు వాలిపోయినట్లుంటే వాటిని చక్కగా ట్రిమ్ చేసి వలయంలా తీర్చిదిద్దాలి. ఇలా చేస్తే కళ్ళు పైకి ఉబ్బినట్లు కనిపిస్తాయి.
** కళ్ళు బాగా అలసిపోయి ఉంటే గ్రీన్ టీ బ్యాగ్స్‌ని లేదా దూది ఉండలను రోజ్ వాటర్‌లో ముంచి కళ్ళకింద ఉంచితే అలసట తొలగిపోయి కళ్ళు తాజాగా కనిపిస్తాయి.
** ముఖానికి మేకప్ వేసుకునే ముందు కళ్ళల్లోకి రెండు చుక్కలు రిఫ్రెషింగ్ ఐ జెల్ వేసుకోండి. దీంతో కనుపాపల్లో కాంతి వస్తుంది.