ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మొటిమలను తరమండిలా...! (Beauty tips | home remedies | Sandal | Vep Oil | Tulasi | Dettol | Tomato)
Bookmark and Share Feedback Print
 
మొటిమలతో ముఖ సౌందర్యం పాడైపోతుంది. దీంతో పదిమందిలో తిరగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని దూరం చేసుకోండిలా.. ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు వేపనూనెతో తయారు చేసిన సబ్బును వాడండి లేదా నాలుగు చుక్కలు డెటాల్ కలుపుకుని స్నానం చేయండి. దీంతో ముఖంపైనున్న మొటిమలు తొలగిపోతాయంటున్నారు వైద్యులు. చందనపు పేస్ట్‌లో గులాబీ జలాన్ని (రోజ్ వాటర్) కలుపుకుని మొటిమలపై పూయండి. ఈ లేపనాన్ని కనీసం అరగంట ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతి రోజూ 15 రోజులపాటు చేయండి. ఈ 15 రోజులలో పరిస్థితి మెరుగౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. పుదీనాను రుబ్బుకుని మొటిమలకు పూయండి. ఇలా 15 రోజులపాటు ప్రతి రోజూ అరగంటపాటు పూస్తే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమలనుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.