పొడి చర్మంతో ఇబ్బంది పడుతుంటే పచ్చికొబ్బరిని అప్పుడప్పుడు ఆహారంగా తీసుకుంటుండాలి. ఇది శరీరానికి సరిపడా తేమను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉండటంతో శరీర చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది.
కొబ్బరిపాలు వారానికి రెండుసార్లు చర్మానికి పట్టిస్తుంటే చర్మంలోని మృతకణాలు, మురికి తొలగిపోతుంది. శరీర చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
మీ శిరోజాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటే కొబ్బరిపాలను తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేయాలి. దీనివల్ల శిరోజాలు పట్టుకుచ్చుల్లా జాలువారతాయి. కొత్త నిగారింపును సంతరించుకుంటాయి.
అలాగే ప్రతి రోజు రెండు చెంచాల కొబ్బరి నూనెను సేవిస్తుంటే జీర్ణవ్యవస్థకు బాగా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.