ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » బ్లాక్‌హెడ్స్‌తో పార్టీలకు వెళ్లలేకపోతున్నారా...? (Beauty | Wrinkles | Skin | Care | Curd | Black heads)
 
బ్లాక్‌హెడ్స్ ఉంటే పదిమందిలో తిరిగేందుకు, పార్టీలకు వెళ్ళినప్పుడు అవి కొట్టొచ్చినట్లు కనపడుతాయి. దీని నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అవి తొలగిపోతాయంటున్నారు వైద్యులు.

** బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకునేందుకు తొలుత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. మెల్లగా స్క్రబ్ చేయండి. దీంతో ముఖంపైనున్న జిడ్డు తొలగిపోతుంది. మీరు స్క్రబ్ చేస్తే ముఖం శుభ్రంగా తయారవుతుంది.

** ఇంటినుంచి బయటకు వెళ్ళేముందు ముఖంపై మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

** ఓ పెద్ద పాత్రలో నీటిని వేడి చేసుకోండి. తర్వాత ఆ నీటి ఆవిరిని ముఖానికి పట్టించండి. దీంతో మీ ముఖంపైనున్న బ్లాక్‌హెడ్స్‌ను శులభంగా తొలగించవచ్చంటున్నారు వైద్యులు.


** బ్లాక్‌హెడ్స్‌ను తొలగించేందుకు బ్లాక్ హెడ్స్‌ స్ట్రిప్‌ను ఉపయోగిస్తే ఇవి శులభంగా తొలగిపోతాయి.

** మీ చేతులతో బ్లాక్ హెడ్స్‌‌ను తాకకండి. దీంతో వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంది.

** శరీర చర్మసౌందర్యాన్ని కాపాడుకునేందుకు టోనర్, క్లీనర్ మరియు మాయిశ్చరైజర్‌ను వాడండి. మీరు వాడే ఈ పదార్థాలు మంచి కంపెనీవై ఉండేలా చూసుకోండి.

** మీరు వీలైనంత ఎక్కువగా నీటిని సేవిస్తుండండి. దీంతో కడుపులోనున్న మలినాలు తొలగి ఉపశమనం కలుగుతుంది.

** బ్లాక్‌హెడ్స్‌ ఉన్నవారు మసాలా దినుసులతో కూడుకున్న ఆహార పదార్థాలు, నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలను ఎక్కువగా సేవించకూడదు. ఇలాంటి ఆహార పదార్థాలను సేవిస్తుంటే అది శరీర చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్యులు.

** ప్రతి రోజూ నియమానుసారం వ్యాయామం చేస్తూ సమతుల్యమైన ఆహారం తీసుకుంటుండాలి. దీంతో శరీర చర్మం కాంతివంతంగా ఉంటూ అందంగా తయారవుతుందంటున్నారు వైద్యులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.