ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » జోలీ విడుదల చేసిన "షీ" పర్ఫ్యూమ్‌లు (SHE | perfumes | deodorants | harmony |)
 
WD
WD
మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పర్ఫ్యూమ్‌‌లు, డియోడొరెంట్స్‌ను "షీ" పేరుతో జోలీ సంస్థ మంగళవారం చెన్నయ్ మార్కెట్లోకి విడుదల చేసింది. మహిళలకు అందంతో పాటు అలంకరణ కూడా ముఖ్యం. ఇందులో అలంకరణకు చాలామంది ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ అలంకరణలో పర్ఫ్యూమ్‌లను వాడుతుంటారు. ఈ పర్ఫ్యూమ్‌లలో ప్రకృతి పరంగా లభించిన పూలు, పండ్లతో తయారు చేసినదే ఈ "షీ" పర్ఫ్యూమ్ అని జోలీ సంస్థ నిర్వాహకులు తెలిపారు‌.

కొన్ని పర్ఫ్యూమ్‌లు కేవలం 15 నిమిషాలుంటే, కొన్ని ఒక గంట పాటు మాత్రమే సువాసనలు వెదజల్లుతాయి. కానీ, తమ కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన పర్ఫ్యూమ్‌‌లను వాడితే అది రోజంతా తాజాగా ఉంచుతుందని నిర్వాహకులు తెలిపారు. దీని వాడకం కూడా చాలా తేలికగా ఉంటుందని వారు తెలిపారు. ఇందులో ఈజీ క్యాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసామని వారు పేర్కొన్నారు.

పలు రంగుల్లో లభించే తమ పర్ఫ్యూమ్‌ బాటిల్స్ 50 మి.లీ., 150 మి.లీలలో లభ్యమౌతాయని వారు పేర్కొన్నారు. తాము రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసిన "షీ" పర్ఫ్యూమ్‌లు మరియు డియోడొరెన్ట్స్ ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు మరింతగా నచ్చే విధంగా తయారు చేశామని వారు వివరించారు.

కాగా, ఈ ఫెర్ఫ్యూమ్స్.. ఆరు రకాలైన సువాసనల్లో లభిస్తాయని, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే తాము రూపొందించామని నిర్వాహకులు పేర్కొన్నారు. వీటి ధర రూ.60 నుంచి రూ.2500ల వరకు పలుకుతుందని వారు తెలిపారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.