ముఖారంవిందాన్ని పెంచుకోవడానికి స్వచ్ఛమైన తేనెతో ఫేషియల్ చేసుకుంటే చాలా బాగుంటుందని సౌందర్యనిపుణులు సూచిస్తున్నారు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే... ఒక చెంచా తేనె, రెండు చెంచాల ఆల్మండ్ పౌడర్, ఒక చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారుచేసుకోండి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి దట్టించండి. అరగంట తర్వాత బాగా ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేసుకోండి. ఇది ఎంతో సహజసిద్ధమైన సౌందర్య సాధన. దీంతో మీ ముఖారవిందం పెరుగుతుందంటు్న్నారు సౌందర్య నిపుణులు.