ప్రతి ఒక్కరికి వారి వారి జుట్టు అందాన్నిస్తుంది. ముఖ్యంగా ఆడవారికైతే మరీనూ... కొందరిలో జుట్టు ఊడిపోయే సమస్య తరచూ వేధిస్తుంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే...విటమిన్ బి కలిగిన పండ్లు, ఆకు కూరలు తీసుకుంటుండాలి. విటమిన్ బి, మీ కురులను ఒత్తుగా, నిగనిగలాడేలా చేస్తుంది.
తరచుగా జుట్టు ఊడే సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా బి విటమిన్‌ను తీసుకోవాలి. సాధ్యమైనంతవరకూ ఔషధాలు కాకుండా సహజసిద్ధంగా ఉండే బి విటమిన్ కలిగిన పండ్లు తీసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యవంతమైన కేశ పోషణకు పౌష్టికాహారం ఎంతో అవసరం. శరీర పోషణలో కేశ పోషణ కూడా ఓ భాగం. కేశాలు నిగనిగలాడేందుకు, బలంగా, దట్టంగా పెరిగేందుకుగాను వాటికి పోషక విలువల్ని అందించాలి.
ప్రొటీన్లు, విటమిన్లు కేశపోషణలో ప్రధానపాత్ర వహిస్తాయి. సరైన పోషకాహారం లేకపోతే వయసుకన్నా ముందే జుట్టు పాలిపోయి నెరిసిపోయినట్లుండటం జరుగుతుంది.