మహిళల సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేసేటివి నగలుకూడా. ఆ నగలు బంగారంవైతే మరింత అందంగా ఉంటుంది. కాని ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో స్ఫటికతో తయారు చేసిన ఆభరణాలు మార్కెట్లో లభిస్తున్నాయి. బంగారం నగలతోపాటు మహిళల మనసుని మురిపించేవి స్పటికాభరణాలే.
ప్రస్తుతం మార్కెట్లో ఇవి వివిధ రంగులు, పలు డిజైన్లలో అందుబాటులోకి వచ్చేశాయి. సంప్రదాయ పరికిణీ-పావడా, చీరకట్టు, గాగ్రా, జీన్స్, టాప్స్‌లాంటి ఆధునిక దుస్తుల మీదా అతికినట్టు సరిపోతాయి.
దుస్తులకు, రూపానికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. తక్కువ ధరకే లభించే ఈ స్ఫటికాభరణాల్లో జూకాలు, జడపిన్నులు, ముక్కు పుడకలు, గాజులు, బ్రేస్‌లెట్లు, హారాలు, పెండెంట్లు, కాలి పట్టీలు ఇలా ఎన్నో రకాలలో లభ్యమౌతున్నాయి.
ఆసక్తి కలిగిన వారు తమ దుస్తుల రంగులను బట్టి విడిగా స్ఫటికాలు తెచ్చుకుని ఇంట్లోనే తమకు కావలసిన డిజైన్లను తయారుచేసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలు మొదలుకొని ప్రముఖ మోడళ్ల దాకా అందరూ ధరిస్తున్న ఈ స్ఫటికాభరణాలను మీరూ ప్రయత్నించి చూడండి. దీంతో మీ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది.