** చర్మ సౌందర్యానికి బాదం నూనెను ఉపయోగిస్తుంటే మీ శరీర ఛాయలో మార్పులు సంభవించి రంగు నిగారింపునిస్తుంది. పొడిబారిన చర్మంలో తిరిగి చెమ్మదం చేరి చర్మం మృదువుగా మారి నిగనిగలాడుతుంటుంది. దీంతో బాదంనూనె చర్మసౌందర్యానికి ఎంతో ఉపకరిస్తుందంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు.
** పరిశుభ్రమైన బాదం నూనెను ఆహారంలో, వంటల్లో వాడుతుంటే శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నరాల బాధలను కూడా నివారిస్తుంది.
** బాదం నూనెలో విటమిన్ డి పుష్కలంగా ఉండటంతో ఇది శరీరంలోని ఎముకలను దృఢపరుస్తుంది. బాదం నూనెను తలకువాడటం వలన తలలోని చుండ్రు తొలగిపోతుంది. వెంట్రుకలను బలంగా, పట్టులా ఉంచడంలో ఉపయోగకారిగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.