ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » నిగ నిగలాడే అందమైన కురులకోసం...! (Women | Hair | Mango | Milk | Egg | Protiens | Calcium | Carrot)
Feedback Print Bookmark and Share
 
FILE
ఆడవారు అందంగా ఉండాలని అనుకుంటారు. వారి అందాన్ని ఇనుమడింపజేసేది శిరోజాలు. ప్రస్తుత కాలుష్య వాతావరణం నుండి శిరోజాలకు జాగ్రత్తలు తీసుకోవాలి.

** శిరోజాలు ఒత్తుగా పెరగాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు ప్రొటీన్లు, క్యాల్షియం, ఆకుకూరలు క్యారెట్‌, మామిడికాయలు, అప్రికాట్‌, చిరుధాన్యాలు, మొలకధాన్యాలు ఎక్కువగా అలసందలు లాంటివి తీసుకోవాలి. జుట్టు ఊడిపోతోందని అనిపిస్తే... మీకు మీరే చికిత్స చేసుకోవచ్చు.

** తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు మసాజ్‌ చేసుకోవాలి. కొంత మంది జుట్టు చిక్కుబడిపోతుంది. చిందరవందరగా ఉంటుందని మసాజ్ చేసుకునేందుకు ఇష్టపడరు.

** అలాంటి వారు గుడ్డులోవుండే పచ్చసొనతో తలమీది జుట్టుకు పట్టించి మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి ఆ తర్వాత తలస్నానం చేయాలి.

** స్నానం చేసిన తరువాత తలను మొత్తటి టవల్‌తో జుట్టుని రుద్దేస్తూ రఫ్‌గా తుడుచుకోకుండా, మృదువుగా తుడుచుకుంటూ మెల్లగా, ఫ్యాన్‌ కింద వెంట్రుకలు ఆరబెట్టుకోవాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.