ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మేకప్ వేసుకోవాలనుకుంటే...! (Make-up | Roll-on | Eye-brows | Lipstick | Maroon | Rose | Red,)
Feedback Print Bookmark and Share
 
** మేకప్ వేసుకోవాలనుకునేవారు రోల్ ఆన్ మస్కారా బ్రష్‌తో మొదటగా కనురెప్పలపైన రాయండి. రెండు నిమిషాలు ఆగి కనురెప్పల కింద నుంచి మస్కారాను రాయండి. దట్టమైన కనురెప్పలు మీ సొంతం అవుతాయి.

** తర్వాత లిప్‌స్టిక్‌ని లేత మెరూన్, గోధుమ రంగుల్లో ఎంచుకోండి. ఇవి అందరికీ సరిపోతాయి. మరీ ముదురు రంగు అంటే చాక్లెట్, ఎరుపు, మెజెంతా, గులాబీ, కాషాయం లాంటి వాటి జోలికి వెళ్లకండి. పగటిపూట ఈ రంగులు బాగుండవు.

** మేకప్ ఎంత పద్ధతిగా వేసుకుంటామో తీసేటప్పుడూ అంతే జాగ్రత్తగా తీయాలి. ముఖాన్ని కొంచెం తడి చేసుకొని మీకు సరిపోయే క్లెన్సర్‌తో రెండు నిమిషాల పాటు కళ్లు మూసుకొని బాగా మర్దన చేయండి. దూదిని నీళ్లల్లో ముంచి ముఖాన్ని, కళ్లను బాగా తుడిచేయండి. తర్వాత కళ్లను తడి దూదితో శుభ్రం చేయండి.

** కళ్ళపై ఐ లైనర్, మస్కారా ఏమాత్రం ఉండకూడదు. సబ్బుతో శుభ్రంగా కడిగేయండి. లేకపోతే మొటిమలు రావడం, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.