ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » అందంగా కనపడాలంటే తేలికపాటి మేకప్ వేసుకోండి (Make-up | Herbal Soap | Face | Neck | Compact Powder | Foundation)
Feedback Print Bookmark and Share
 
** అందంగా కనపడేందుకు తేలికపాటి మేకప్ వేసుకుంటే అసలు మేకప్ వేసుకున్నట్లు ఎవ్వరికీ అనిపించదు. మేకప్ వేసుకోవాలనుకునేవారు ముందుగా హెర్బల్ సబ్బుతో ముఖాన్ని కడుక్కోండి. తర్వాత మీకు నప్పే ఫౌండేషన్ తీసుకొని, తాజాగా ఉన్న ముఖం, మెడ మీద తేలిగ్గా రాయండి.

** కాంపాక్ట్ పౌడర్‌గానీ, ట్రాన్స్‌ల్యూసెంట్ పౌడర్ గానీ పఫ్‌తో ముఖానికి, మెడకు రాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ షైనింగ్ పౌడర్‌గానీ, గ్లిట్టర్స్‌ను గానీ ముఖ్యంగా పగటి పూట వాడకండి.

** ఐ షాడో వేసుకోవాలనుకునే వారు గోధుమ రంగును ఎంచుకోండి. ఐ షాడోని ఎప్పుడూ కంటిని దాటి బయటకి వెళ్లనివ్వకండి.

** ఎప్పుడూ గులాబీ, ఎరుపు, కాషాయం రంగులు కలిగిన ఐ షాడోలతో ప్రయోగాలు చేయొద్దు. అందరికీ ఈ రంగులు నప్పవు. బ్లషర్‌ని అవసరమైతేనే వాడండి. చీక్ బోన్ కింద నుంచి కణతల వరుకు తేలిగ్గా రాయండి.

** బుగ్గలు లావుగా ఉంటే వాటి మీదా వేసుకోవచ్చు. కానీ చర్మంతో కలిసిపోయేలా రాస్తే అందంగా ఉంటుంది. మీరు మేకప్ వేసుకున్నట్లు కనపడదు.

** కళ్లు పెద్దవిగా ఉంటే లోపల మాత్రమే కాటుక పెట్టుకోండి. సాధారణ కళ్లకు కనురెప్పల పైన, కింద ఐ లైనర్‌గానీ, ఐ పెన్సిల్‌గానీ వాడుకోవచ్చు. నలుపు, ముదురు గోధుమ, ముదురు నీలం రంగులు బావుంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.