ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » ముఖారవిందాన్ని పెంచే క్యారెట్ (Honey | Multhani Mitti | Milk | Carot | Paste)
Feedback Print Bookmark and Share
 
** ముఖారవిందం కోసం మంచి రంగుతో కూడుకున్న రెండు క్యారెట్లను ఉడికించి గుజ్జుచేసి అందులో తేనె కలపుకోండి. దీన్ని ముఖానికి దట్టించండి. ముఖం కింది నుంచి పైకి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగేసుకోండి.

** రెండు క్యారెట్లు తీసుకొని మెత్తగా పేస్టులా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఓ చిన్న గిన్నెలో వేసుకోండి. ఇందులో ఆయిదారు చెంచాల చిక్కటి పచ్చిపాలు కలుపుకోండి. దీనికి ముందు మీ ముఖాన్ని క్లెన్సింగ్‌ మిల్క్‌తో శుభ్రం చేసుకోండి. ఆపై ఆల్మండ్‌ క్రీముతో మర్దన చేయాలి. ఇలా మర్దన చేసేటపుడు సిద్దంగా ఉన్న క్యారట్‌ ముద్ద, పాలు ఉపయోగించాలి.

ముఖానికి ఆ పేస్ట్ వాడిన 15 నిమిషాల తర్యాత ముఖం శుభ్రం చేసి ఆవిరిపట్టండి. బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ తీసెయ్యాలి. కొంచెం క్యారెట్‌ గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లాగా వేసుకోవాలి. పావుగంట అయిన తరువాత ప్యాక్‌ తీసేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చర్మం నునుపుగా కాంతివంతంగా కనిపిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.