ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చర్మ సౌందర్యానికి మార్నింగ్ ఫేషియల్ (Oil | Make-up | Moisturizer | Sunscreen | Lotion | Skin | Sweat pores)
Feedback Print Bookmark and Share
 
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గోరువెచ్చటి నీటిలో క్లీంజర్ లేదా ఏదైనా ప్యూరిఫైయింగ్ జెల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని కడగండి. ఎప్పుడు కూడా మీరు సబ్బును వాడకండి. ఎందుకంటే సబ్బు వలన మీ ముఖంలోనున్న సహజసిద్ధమైన ఆయిల్‌ను పీల్చేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది.

ముఖాన్ని కడిగిన తర్వాత ఎల్లప్పుడు ఓ మెత్తటి తువాలుతో తుడవండి. ముఖాన్ని ఎక్కువగా రుద్దకండి. అలా చేస్తే చర్మంలో పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఆ తర్వాత టోనింగ్ చేయండి. టోనింగ్‌తో మీ చర్మంలో దాగివున్న మురికి, మిగిలివున్న మేకప్ బయటకు వచ్చేస్తుంది. టోనర్‌తో మీ ముఖ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది.

ఆ తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ పూయండి. అది మీ చర్మానికి తగ్గట్టుండాలి. చర్మంపై మాయిశ్చరైజర్ చేయడం వలన మీ చర్మం సుతి మెత్తగాను, నునుపుగాను తయారవుతుంది. దీంతోపాటు చర్మంలోని సూక్ష్మరంద్రాలు, పొడిబారడం నుంచి కాపాడబడుతారు. మాయిశ్చరైజర్ చేసిన తర్వాత సన్‌స్క్రీన్ వాడొచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.